పంట పొలాల్లో వేసిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని రైతు ఆవేదన..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి : జూన్ 07
రైతు స్థలంలో ఇంటి యజమానికి చెప్పకుండా విద్యుత్ శాఖ అధికారులు మూడు విద్యుత్ పోల్స్ పెట్టడం జరిగింది, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన ధార రాజమణి సర్వేనెంబర్ 804/1/4 తనకు సంబంధించిన 23 గుంటలలో భూమిలో మూడు విద్యుత్ కొత్త స్థానాలు విద్యుత్ శాఖ అధికారులు ఇంటి యజమానికి తెలపకుండానే పెట్టారని మహిళా రైతు దార రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు . గత 15 రోజుల క్రితం నేను మా అమ్మ మూడు నాలుగు రోజులు ఫంక్షన్ వెళ్లడం జరిగిందని ఫంక్షన్ పోయి తిరిగి వచ్చేసరికి మా భూమిలో మూడు విద్యుత్ కొత్త స్తంభాలు వేయడం జరిగిందని. ఇటి విషయం పైన రామారెడ్డి ఏడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నేను పంట పండించుకొని పంటపైనే జీవనాధారం కొనసాగిస్తున్నామని. పిల్లల చదువు ఫీజులు కూడా పంట పండించే దానిపైనే వారి ఫీజులు కట్టడం జరుగుతుందని, ఇప్పుడు కొత్తగా మూడు పోల్స్ వేయడం జరిగిందని అంతకంటే ముందు 8 పోల్స్ ఉన్నాయని 23 గుంటలలోని మొత్తం 11 పోల్స్ ఉన్నాయని, పాతవి మాకు తెలియకుండా వేశారని వదులుకున్నాం అని అన్నారు.. కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా మరొక మూడు విద్యుత్ స్తంభాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోని వెంటనే కొత్తగా వేసిన మూడు విద్యుత్ స్తంభాలను తీసివేయాలని లేకపోతే ఇక్కడే వారి పేరు పైన ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రైతుకు తెలవకుండా వారి పంట పొలంలో మూడు కొత్త స్తంభాలు ఎందుకు వేశారని ఏఈ , ఏడీ సిఎండి లకు పిర్యాదు కూడా చేయడం జరిగిందని ఏడి గారు సానుకూలంగా స్పందించారని , సిఎండి కూడా చాలా సానుకూలంగా స్పందించారని కానీ ఏఈ వెంకటేశం నిర్లక్ష్యంగా వహిస్తున్నాడని. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఇదంతా ఏఈ వెంకటేశం నిర్లక్ష్యం తోటే జరిగిందని దయచేసి అధికారులు ఆదుకొని మహిళా రైతులకు న్యాయం చేయాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.