నారద వర్తమాన సమాచారం
జూన్ :08
అంజలి ఘటించిన చిరు, నాగ్, కమల్‌హాసన్
ఈనాడు గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావు నేటి తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే! మెగాస్టార్ చిరంజీవి రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.అక్కినేని నాగార్జును కూడా రామోజీరావుకు నివాళి అర్పించారు. ఆయన గొప్ప దార్శనికుడు. ఎంచుకున్న ప్రతిరంగంలో సక్సెస్ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళ స్టార్, విశ్వనాయకుడు కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భారతీయ మీడియా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు, ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. రామోజీరావు ఫిల్మ్ సిటీ తన క్రాఫ్ట్ గౌరవార్థం అంకితం చేయబడింది, ఇది షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు, ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఈ దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు అయిన ఆయన మరణించడం భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈటీవీ, ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ సినిమాలు, మయూరి.. సంస్థలు, ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసాను. ఆయన ప్రతి చోటు ఉన్నారు. అయినా మిమల్ని ఎప్పుడూ కలవలేదు. వీడ్కోలు లెజెండ్ రామోజీ రావు ’’
-నాని
“బాలనటుడిగా మనసు మమత సినిమా, హీరోగా ‘నువ్వేకావాలి’ సినిమా ..ఈ రెండు ఉషాకిరణ్ మూవీస్ లోనే ..రామోజీరావు గారి గైడెన్స్ లోనే ఇంట్రడ్యూస్ అవటం జరిగింది. అది నా అదృష్టం. జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటాను. వారి మరణం సినీ రాజకీయ పాత్రికేయ రంగాలకే కాదు. దేశానికే తీరని లోటు.. లెజెండ్ నెవర్ డైస్.. వారు మన గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారు”
వారి ఆత్మకు శాంతి చేకూరాలి.
- తరుణ్..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.