
నారద వర్తమాన సమాచారం
జూన్ 09
ఐఐటీ ర్యాంకు సాధించిన భాను కార్తీక్ కు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనసత్కారం
భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఐ ఐ టి అడ్వాన్స్ ఎగ్జామ్లో 3264ర్యాంక్ .ఒ బి సి కోటాలో577 ర్యాంక్ సాధించిన మన విశ్వకర్మ ఆణిముత్యం వి.భాను కార్తీక్ ను సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో. వేద పురోహితులు నాగళ్ళ సాయి బృందం చే వేద ఆశీర్వచనం అందించి దుశాలువాతో ఘనంగా సత్కరించడమైనది. గుడ్లూరు సాయి యశ్వంత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ అద్దంకి వెంకట అజయ్ హాజరై సన్మానించిట్రస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఆ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెన్నపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ. ఈ జిల్లా నుండి ఎక్కువమంది విద్యావేత్తలుగా తయారు చేయడమే ఆశయంగా పనిచేస్తున్నాము అని. నేడు దేశ స్థాయిలో ర్యాంకు సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి బాబుని మన వారందరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుందుర్తి సీతారామాంజనేయులు.రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం. జిల్లా యువజన సంఘ అధ్యక్షులు తువ్వపాటి జనార్ధన చారి. అద్దంకి కార్యదర్శి ఏలూరి వీర బ్రహ్మచారి. ఉద్యోగ సంఘ నాయకులు చోడా వెంకట సుబ్బారావు. భాను కార్తీక్ తండ్రి కృష్ణమాచారి మరియు సంఘీలు పాల్గొన్నారు







