Saturday, November 23, 2024

కాణిపాకం ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది

నారద వర్తమాన సమాచారం

జూన్ :09

కాణిపాకం ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ వ్యాపారులో దళారులో మోసం చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది ద్వారా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ఆలయ దర్శనార్థం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు ఈ నేపథ్యంలో దేవస్థానం వద్ద స్వామి దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు 51 రూపాయిల శీఘ్రదర్శనం 150 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లను విక్రయిస్తుంటారు అలాగే ప్రోటోకాల్ విఐపి లకు వీఆర్వో కార్యాలయం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తుంటారు అయితే ఆలయ అధికారులు ఇదే అదునుగా భావించి భక్తులను నిలువు దోపిడీ చేస్తూ ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు ప్రోటోకాల్ విఐపి దర్శనాలు ఏర్పాటు చేయాల్సిన వీఆర్వో కార్యాలయం సిబ్బంది దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలు మేరకు 500 రూపాయలు 1000 రూపాయలు విక్రయిస్తూ సామాన్య భక్తులతో పాటు దర్శనాలు కల్పిస్తున్నారు ఆలయంలో 500 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకి ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ ఆశీర్వచనం చేయాల్సి ఉంది అలాగే వెయ్యి రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక ఆశీర్వచనం చేయాల్సింది ఈ మేరకు పిఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రతిరోజు 500 నుంచి 1500 టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది ఈ టికెట్లు తీసుకున్న భక్తులందరికీ ఆశీర్వచనం అందించకపోగా సాధారణ భక్తులతో పాటు లఘు దర్శనం మాత్రం కల్పిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నించే భక్తుల పట్ల ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి తాజాగా 500 రూపాయలు టికెట్ తీసుకున్న నెల్లూరు వాసులతో పాటు ఉత్తరప్రదేశ్ చెందిన ఓ మహిళ ఈ నిలువు దోపిడీపై మీడియా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత మూడు నాలుగు నెలలుగా దేవస్థానం వద్ద ఇదే తంతు కొనసాగుతోంది ఆలయ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ప్రస్తుతం ఉన్న పంచామృతాభిషేకం టికెట్లను మూడు కాలాలపాటు నిర్వహించకుండా ఏకకాలంలో నిర్వహించాలని ఉద్దేశంతో 5000 రూపాయలుగా టిక్కెట్ ధర నిర్ణయించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గతంలో ఉన్న ఈవో సురేష్ బాబు నోటిఫికేషన్ మాత్రం జారీ చేయడంతో ఆయనను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు వివరణ కోరుతూ ఆగమేఘాలపై ఇక్కడి నుంచి బదిలీ చేశారు అయితే ప్రతిరోజు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్లు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆలయ ఉన్నదాధికారిపై దేవాదాయ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదేవిధంగా ఈ నిలువు దోపిడీ కొనసాగితే చట్టపరంగా ఆలయ ఉన్నతాధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పలువురు తెలిపారు అలాగే ఈ నిలువు దోపిడి పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు స్థానిక జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తామని భక్తులు తెలిపారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading