నద వర్తమాన సమాచారం
నరేంద్ర మోడీ కేబినెట్ లో మంత్రి పదవులు తెలంగాణకు దక్కేనా?
తెలంగాణ
:జూన్ 09
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.15 నుంచి 8 గంటల మధ్య ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరు కున్నారు.
ఇక మోదీతో పాటు దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
ఇక తెలంగాణ నుంచి ఎవరికి కేంద్ర పదవులు దక్కుతాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని మెుత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలను కమలం పార్టీ దక్కించుకుంది.
సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న ఈటల రాజేందర్, డీకే అరుణ మంత్రి పదువుల రేసులో ఉన్నట్లు సమాచారం.
గత మోదీ కేబినెట్‌లో కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా పని చేయగా.. ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మాస్ లీడర్‌గా పేరున్న బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రేసులో ఉన్నారు.
ఆయన కరీంనగర్ నుంచి ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయ టంలో విశేషంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలో తీసుకోవాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈటల రాజేందర్ బలమైన బీసీ సామాజికవర్గ నేత. ఈ కోటాలో ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక మహిళా కోటాలో డీకే అరుణకు ఎక్కువగా ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఫేర్ బ్రాండ్‌గా పేరున్న ఆమెకు కేబినెట్ పదవి దక్కే ఛాన్స్ ఉంది.
మెుత్తంగా తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.