నారద వర్తమాన సమాచారం
జూన్ :10
భారతీయులు అందరూ మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక విధులు తెలుసుకోవాలి మరియు ఆచరించాలి. ప్రస్తుత కాలంలో ప్రాథమిక విధులు అనేవి 10
వ తరగతి లో
ఐదు మార్కుల క్వశ్చన్స్ గానే అందరికి తెలుసు అంతటితో అవి వదిలి వేస్తున్నాం. ఎందుకంటే ఇంటర్ లో వేరే వేరే గ్రూప్ లు, తరువాత డిగ్రీ లో వేరే వేరే గ్రూప్ లు, తరువాత ఉద్యోగాల వేటలో కొందరు, మరి కొందరు
పి జి ,
పిహెచ్ డి లు, కానీ ఈ ప్రాథమిక విధులు ఎంత మందికి గుర్తుంటున్నాయి?
బాధ్యత తెలియనపుడు మంచి పౌరులుగా ఏలా తయారవుతారు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన విద్యా వ్యవస్థలో 6వ తరగతి నుండి పి .జి. వరకూ అన్నీ వార్షిక పరీక్షలలో ఈ ప్రాధమిక విధులు కచ్చితంగా విద్యార్ధులు రాసేలా మరియు దేశం/ రాష్ట్రాలలో మొత్తం అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగము గుర్తించిన ప్రాధమిక విధులు రాసేలా నిబంధన పెట్టాలి.అప్పుడు కొన్నాళ్ళకయినా జాతీయ భావం కలుగుతుంది.
రాజకీయ నాయకులు కూడా వారి ప్రమాణస్వీకార సమయంలో ఈ ప్రాథమిక విధులు అన్నీ ఒకసారి చెప్పాలి.
సినీ రంగంలో వాళ్ళు సెలబ్రిటీస్ అవుతున్నారు కానీ వాస్తవంగా ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ ,రా ఏజెంట్స్ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు. “వారే నిజమైన హీరోలు”
ధర్మ రక్షణే దేశ రక్షణ!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.