నారద వర్తమాన సమాచారం
జూన్ :10
చంద్రబాబు సంకల్ప బలంతోనే అమరావతికి మంచిరోజులు: ప్రత్తిపాటి
చంద్రబాబు సంకల్పబలంతోనే అమరావతికి తిరిగి మంచిరోజులు వచ్చాయని, ఆంధ్రప్రజలు అందరి కలల రాజధాని నిర్మాణం అతిత్వరలోనే పూర్తవుతుందన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అమరావతి పూర్వవైభవం దిశగా ప్రస్తుతం మొదలైన పనులు రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయని ఆయన స్పష్టం చేశారు. నవ నగరాలతో నాడు రైతులకు చంద్రబాబు సీఆర్డీఏ తరఫున ఏం వాగ్దానం చేశారో అంతకు మించిన స్థాయిలో అమరావతి 2.0ను సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. కూటమి ఘనవిజయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లు నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల్లో కదలిక సందర్బంగా ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ప్రత్తిపాటి. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, మండలాలలోని 29 గ్రామల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏం నిర్మించాలనేది సీఆర్డీఏ బృహత్ ప్రణాళికలో స్పష్టంగా ఉందన్న ఆయన… వాటన్నింటి పూర్తితో దేశంలో అతి పెద్ద మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా సీఆర్డీఏ సరికొత్త చరిత్రను లిఖించబోతుందన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని మించిన అవకాశాల స్వర్గంగా అమరావతి సిద్ధం కానుందన్నారు. ఇదే విషయాన్ని ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మాగజీన్‌లోనూ ప్రస్తావించారని, ప్రపంచం లోనే అత్యంత ఉత్తమమైన 6 భవిష్యత్ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలవబోతుందని అందు లో పేర్కొన్నారన్నారు. అయిదేళ్ల వైకాపా, జగన్ గ్రహణం తర్వాత ఇవాళ రాజధాని ప్రాంతం ఆ కలలన్నింటికీ కొత్తరెక్కలు వచ్చాయంటే అందుకు కారణం చంద్రబాబే అన్నారు ప్రత్తిపాటి. మహోద్యమంగా సాగిన అమరావతి రైతుల ఉద్యమంలో కూడా వారంతా జగన్ పోవాలి, తెలుగు దేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాజధాని పూర్తవుతుందని వేయి దేవుళ్లను మొక్కారన్నారు. వారి ప్రార్థనలు, అమరావతి శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు తీసుకున్న సంకల్పబలంతోనే ఈరోజు అమరావతి మళ్లీ సగౌరవంగా నిలబడబోతోందని ఆనం దం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.