నారద వర్తమాన సమాచారం
జూన్ :10
పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక బస్సులు
జనసేన శ్రేణులు అందరూ 8374104701 ఫొన్ నెంబర్ కు సంప్రదించాలి అని తెలిపిన జనసేన నాయకులు, ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్
శ్రీకాకుళం :
అమరావతిలో ఈ నెల 12న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీకి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన నాయకులు, ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలోని ఆయన చాంబర్ లో సోమవారం విలేకరుల మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, మీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను సంప్రదించి పెద్ద ఎత్తున పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలు దేరాలని కోరారు. ఇతర వివరాల కోసం 8374104701 నెంబరుకు సహకరించాలని చెప్పారు.
ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయ వంతం చేయాలని డాక్టర్ శ్రీధర్ కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.