చేనేతకు ఉపాధి కల్పించాలని వినతి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న చేనేత నాయకులు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న చేనేత పరిశ్రమను ఆదుకొని కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోచంపల్లి పట్టణానికి చెందిన నాయకులు హైదరాబాదులో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. టెస్కో ద్వారా చేనేత సహకార సంఘం లో నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయాలని కోరారు. సబ్సిడీ, భీమా, సహకార సంఘం ఎన్నికల నిర్వహణ వంటి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, కృష్ణ, భాస్కర్, వెంకటేశం పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.