నారద వర్తమాన సమాచారం
మారుమూల ప్రాంతాల్లో మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణ
: జూన్ 11
విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు మూసివే యొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రవీంద్రభారతిలో నిన్న సాయంత్రంజరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలను పునర్నిర్మిం చేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు.
కొన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నిటిని దృష్టిలో ఉంచుకొని 11 వేల పోస్టుల తో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు.
సింగిల్ టీచర్ ఉన్న బడు లను మూసివేయ రాదని తండాలు, గూడేల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం వల్ల పేదలు, దళితులు, గిరిజనులకు, విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు..
మారుమూల ప్రాంతాల్లో మెరుగైన విద్యను అందించ డమే మా ప్రభుత్వ లక్ష్యమ న్నారు సీఎం రేవంత్ రెడ్డి..విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు వెల్లడించారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.