Thursday, December 12, 2024

చంద్రబాబు కేబినెట్ లో 24 మందికీ దక్కిన చోటు.డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్?

నారద వర్తమాన సమాచారం

చంద్రబాబు కేబినెట్ లో 24 మందికీ దక్కిన చోటు

డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్?

అమరావతి

:జూన్ 12
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఉద యం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు.

ఇక ఆయనతో పాటు నేడు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడుదలైంది. జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పవన్‌‌తో పాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. వీరంతా నేడు ప్రమాణం చేయనున్నారు.

జనసేనకు 3 మంత్రి పదవులు..

జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు. ఇక బీజేపీకి ఒక బెర్త్ కేటాయించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారే ఉన్నారు. 17 మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు.

సామాజిక వర్గాలవారీగా చూస్తే.. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. ముగ్గురు మహిళలు, బీసీలు 8 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు.

మొత్తంగా సీనియర్లు, యువ నాయకుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఎంచుకు న్నారు. ఆనం రామనారా యణరెడ్డి, కొలుసు పార్థ సారథిలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టు కున్నారు.

కొత్త మంత్రుల జాబితా ఇదే

  1. కొణిదెల పవన్ కల్యాణ్
  2. నారా లోకేశ్
  3. కింజరాపు అచ్చెన్నాయుడు
  4. కొల్లు రవీంద్ర
  5. నాదెండ్ల మనోహర్
  6. పొంగూరు నారాయణ
  7. అనిత వంగలపూడి
  8. సత్యకుమార్ యాదవ్
  9. నిమ్మల రామానాయుడు
  10. ఎన్ఎండీ ఫరూక్
  11. ఆనం రామనారాయణరెడ్డి
  12. పయ్యావుల కేశవ్
  13. అనగాని సత్యప్రసాద్
  14. కొలుసు పార్థసారథి
  15. డోలా బాల వీరాంజనేయస్వామి
  16. గొట్టిపాటి రవికుమార్
  17. కందుల దుర్గేశ్
  18. గుమ్మడి సంధ్యారాణి
  19. బీసీ జనార్ధన రెడ్డి
  20. టీజీ భరత్
  21. ఎస్. సవిత
  22. వాసంశెట్టి సుభాష్
  23. కొండపల్లి శ్రీనివాస్
  24. ముండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి…

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading