నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూన్ :12
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని బైక్‌పై ప్రమాణస్వీకారానికి ప్రత్తిపాటి
చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం సందర్బంగా భారీస్థాయిలో పోటెత్తిన. అభిమాన సంద్రంతో గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదికను చేరుకోవడానికి సాహస యాత్రనే చేశారు. జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలతో కిక్కిరిసి పోవడంతో తన వాహనం వదిలి పెట్టి స్థానిక కార్యకర్తల సహాయంతో బైక్‌పై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే… బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. భారీ వాహనాలు ముందుకు కదిల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ముందుగానే ప్రమాణస్వీకార కార్యక్రమానికి బయలుదేరినా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రమాణస్వీకార సభకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎటు కదల్లేని ఆ పరిస్థితుల్లో కారులో నుంచి దిగి కార్యకర్తకు చెందిన ద్విచక్రవాహనంపై సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకార ఘట్టం ముగియడంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపి వెనుదిరిగారు. అయితే ఇదే సమయంలో ట్రాఫిక్ రద్దీ, అభిమాన సందోహం మధ్య ప్రత్తిపాటి పుల్లారావు బైక్ ప్రయాణం దృశ్యాలు వైరల్‌గా మారి అందర్నీ ఆకట్టు కుంటున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.