డాక్టర్ బాలు కు సెలబ్రిటీ అవార్డును అందజేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, టిపిసిసి ప్రచార కమిటీ కో చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..
రక్తదానంలో చేస్తున్న సేవలు అభినందనీయం..
నారద వర్తమాన సమాచారం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:జూన్ 12,
హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రజా డైరీ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెలబ్రెటీ అవార్డును ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి,ఆత్మీయ అతిథి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేయడం జరిగింది.
వ్యక్తిగతంగా 73 సార్లు రక్తదానం చేయడమే కాకుండా 17 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం, యువతకు రక్తదానంపై అవగాహన కల్పించడం,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం సంవత్సర కాలంలోనే 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి నిలవడం ఆదర్శనీయమని అన్నారు. డాక్టర్ బాలు స్ఫూర్తిగా తీసుకొని యువత సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
ఈ అవార్డు రావడానికి సహకరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త కు,ప్రజా డైరీ ఎడిటర్ సురేష్ కు,కామారెడ్డి రక్తదాతల సమూహానికి,ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న మరియు సభ్యులకు,రక్తదాతలకు, మీడియా ప్రతినిధులకు అవార్డు గ్రహీత కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సిటీ నటుడు ప్రొడ్యూసర్ మురళీమోహన్, సుమన్,దర్శక నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి డాక్టర్ విజయభాస్కర్ రామ్ సత్యనారాయణ లు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.