నారద వర్తమాన సమాచారం
జూన్ :12
అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా… ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
జనసేన పార్టీ నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోడీ.. మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫొటో దిగారు. అనంతరం స్టేజీ మీద ఉన్న వారితో ప్రధాని మోడీ సంభాషించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జీతన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్‌మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్ దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.