నారద వర్తమాన సమాచారం
జూన్ :12
ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నరు ప్రధాని మోది. ముందుగా ఏపీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు. ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10.40కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీని ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు రిసీవ్ చేసుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 10.55కు సభా ప్రాంగణానికి చేరకుంటారు. కేసరపల్లిలో ఉదయం 11.27కు ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవ ముహూర్తంలో పాల్గొననున్నారు. సుమారు గంటన్నరపాటు చంద్రబాబుతో పాటు ప్రముఖులతో కలిసి వేదికపంచుకోనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఏపీలోని ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న తరువాత మోదీ తిరిగి ఒడిశాకు పయనమవుతారు. మధ్యాహ్నం 12.45కు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల సమయంలో భువనేశ్వర్ చేరుకోనున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ తరుణంలో ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నమోహన్ చరణ్ మాఝీని సభలో పాల్గొననున్నారు. ఈ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంల పూర్తిఅయిన వెంటనే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు ప్రధాని మోదీ. రాత్రికి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకుంటారు. ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్ పోర్టు పరిసరాలన్నీ గస్తీకాస్తున్నారు పోలీసులు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.