నారద వర్తమాన సమాచారం
నా కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు:చంద్రబాబు
అమరావతి
విజయవాడ:జూన్ 11
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు. ఆనాటి సీఎం విశాఖను రాజధానిగా చేస్తానంటే.. నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అంటూ పరోక్ష విమర్శలు చేశారు చంద్రబాబు.
కర్నూలును న్యాయ రాజ ధానిగా చేస్తామని.. చివరికీ ఏమీ చేయలేదని ఆరోపిం చారు. రాయలసీమలో తక్కువ సీట్లు వస్తాయని తొలుత భయపడ్డానన్నారు. కానీ అక్కడ కూటమికి మంచి సీట్లు వచ్చాయ న్నారు
సీఎం కూడా మామూలు మనిషేనని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని చంద్రబాబు అన్నారు.
తన కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తనకు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు.. కాని
తన కోసం ట్రాఫిక్‌ను ఆపి ప్రజలను మాత్రం ఇబ్బందు లు పెట్టొద్దు అంటూ మరోసారి చంద్రబాబు పోలీసులకు సూచించారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.