
నారద వర్తమాన సమాచారం
సేవ ఆదర్శనీయం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేస్తున్న బొక్క భూపాల్ రెడ్డి
గ్రామంపై అభిమానంతో పాఠశాల విద్యార్థులకు సాయం అందించడం ఆదర్శనీయమని ప్రధానోపాధ్యాయుడు సత్యశుభాకర్ అన్నారు. మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా అటవీశాఖ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు బొక్క భూపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు గురువారం ప్లేట్లను పంపిణీ చేశారు. గతంలో పాఠశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నోముల మాధవరెడ్డి, పెద్దిరెడ్డి యాదగిరి, సురేష్, రాజశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు.








