నారద వర్తమాన సమాచారం
పోచంపల్లి అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు 49 నామినేషన్లు దాఖలు
జూన్ :13
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పట్టణ కేంద్రం లోని పోచంపల్లి అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 9 మంది డైరెక్టర్లకు గాను 6 జనరల్, 2 మహిళా, ఒక ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జనరల్ స్థానానికి 37, మహిళా రిజర్వేషన్ స్థానాలకు 6, ఎస్సీ ఎస్టీ రిజర్వు స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. 14న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉన్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.