
నారద వర్తమాన సమాచారం
జూన్ :13
పల్నాడు జిల్లా
సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గంలోని భట్లూరు గ్రామంలో గ్రామ వైద్యుడు పోట్లూరి శివయ్య ఇంట్లో నిద్రిస్తున్న అతని మీద దాడి చేసిన టిడిపి కార్యకర్తలు, నీ అంతు చూస్తాం, నిన్ను వదిలిపెట్టం అని దుర్భషలాడుతూ కత్తితో దాడికి పాల్పడ్డ టిడిపి కార్యకర్తలు.భయభ్రాంతులకు లోనైనా శివయ్య కేకలు వేయడంతో నిందితులు(శాఖమూరి నరేష్, తూమాటి గోపికృష్ణ, మందడపు హరి సూర్య నారాయణ) అక్కడినుండి వెళ్ళిపోయారు.
ఈ దాడిలో గ్రామీణ వైద్యుడు శివయ్య 39 వ్యక్తి చేతికి తీవ్ర గాయమై తీవ్ర అధిక రక్తస్రావం అయింది. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దాడి ఘటన అంతా తన (శివయ్య)ఇంటికి ఉన్న సిసి టీవీ లో రికార్డులు తీసుకొని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా ఎటువంటి స్పందన లేదు.మరుసటి రోజు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి దాడి చేసిన వారిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.తదనంతరం దాడి చేసిన వారిపై సత్తెనపల్లి డీ ఎస్పీ గురునాధ్ బాబు కేసు నమోదు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపించడం జరిగింది.
శివయ్యకు మద్దతుగా యానాదుల సంక్షేమ సంఘం
రాష్ట్ర అధికార ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య, మేకల శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రమణ, పొట్లూరి సాంబశివరావు, మండల నాయకులు పాల్గొన్నారు.
బాపట్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ..
ప్రభుత్వాలు ఎన్ని మారిన ప్రజలు శాశ్వతం అని,తెలుగుదేశం కార్యకర్తలు చేసే దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, పార్టీలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం దీనిని అందరు ఆలోచించాలి.ఈరోజు శివయ్య పై జరిగిన దాడి అతిహేయమైనదని,నిద్రిస్తున్న వ్యక్తి మీద మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం ఆపై బెదిరింపులు కు గురి చేయడం సరైనది కాదని, బలహీన వర్గాలైన (ఎస్సీ,ఎస్టీ)ల మీద జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని,మా వంతు శివయ్యకు అండగా యానాదుల సంక్షేమ సంఘంలోని నాయకులతో చర్చించి,ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా,ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా అధికారులతో సంప్రదింపులు జరుపుతామని, యానాదుల సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ శివయ్యకు అండగా ఉంటుందని మీడియా ముఖంగా తెలిపారు.
బాధితుడు శివయ్య మాట్లాడుతూ..
ఈ నెల 11 వ తేదీ అర్ధరాత్రి బట్లూరు గ్రామం లోని నా ఇంటిలో నిద్రిస్తున్న నాపై దాడి చేసిన శాఖమూరి నరేష్, తూమాటి గోపిక్రిష్ణ, మందడపు హరి సూర్యనారాయణపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్పందించిన సత్తెనపల్లి డీ ఎస్పీ గురునాధ్ బాబు. డీ ఎస్పీ దాడి ఘటనపై విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.జిల్లా ఎస్పీ, సత్తెనపల్లి డీ ఎస్పీ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపిన పోట్లూరి శివయ్య.రిమాండ్ పంపించిన తర్వాత కూడా గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని,నా ప్రాణానికి హాని ఉందని నాకు రక్షణ కల్పించాలని తెలిపాడు శివయ్య.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.