నారద వర్తమాన సమాచారం
జూన్ :13
అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం దుర్మార్గం
- బిఆర్ఎస్ పార్టీ నాయకులు
- ఒక బీసి నాయకుడిని గద్దె దింపి డబ్బు మదంతో ఉన్న నాయకుడికి పదవి అంటపెట్టడం కాంగ్రెస్ నీచమైన చర్య
- అక్రమ వసూలు, ఇసుక దందా కి పాల్పడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే
- నిరసనగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారి ఆధ్వర్యంలో రేపు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం.. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహా గౌడ్ పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం దుర్మార్గమైన చర్య అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఒక బీసి నాయకుడిని గద్దె దింపి డబ్బు మదంతో ఉన్న నాయకుడికి పదవి అంటపెట్టడం నీచమైన చర్యగా భావించారు. అక్రమ వసూలు, ఇసుక దందా కి పాల్పడుతూ పార్టీ ఫిరాయింపులను అచ్చంపేట ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో దాడులు విపరీతంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్నాయని, దీనికి నిరసనగా నేడు అనగా తేదీ: 13-06-2024 గురువారం రోజున అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు గారి ఆధ్వర్యంలో లింగాల చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. కావున అచ్చంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మధ్యాహ్నం 02:00 గంటలకు అచ్చంపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారి నివాసానికి చేరుకోగలరు.
ఇట్లు
బిఆర్ఎస్ పార్టీ – అచ్చంపేట నియోజకవర్గం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.