నారద వర్తమాన సమాచారం
జూన్ :13
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉందయ్ కుమార్, ఐ ఎ ఎస్
గతంలో పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండే స్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు పెరగడానికి చేసిన కృషిని కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల సీట్లు వచ్చే లాగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని , దానితో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం 10 సీట్లతో పాటు ఇప్పటి వరకు 40 సీట్లు సాధించారని, ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ తన ఇద్దరి కుమారులు గౌతమ్, రాహుల్ లను ఇదే పాఠశాలలో చదివిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, గ్రామ పెద్దలు మరియు దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్ లు, ప్రింటర్, గురుకుల, నవోదయ స్టడీ మెటీరియల్ మొదలైనవాటిని సమకూర్చుకొని ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులు, అబాకస్, చిల్డ్రన్ బ్యాంక్ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు వెంకటేష్ అందరూ సమిష్టిగా, సమన్వయంతో బట్టి విధానంలో కాకుండా పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలతో కృత్యాదార బోధన చేస్తున్నారని, అదేవిధంగా వెంకటేష్ సార్ పాఠశాలకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులు అందరి నెంబర్లను యాడ్ చేయడం ద్వారా అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని, సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు చేయాల్సిన కృత్యాలను, ఇంటి పనిని వాట్సాప్ ద్వారా పంపించి, విద్యార్థులు చేసి పంపించిన వాటిని వాట్సాప్ లోనే దిద్ది విద్యార్థులకు తిరిగి పంపుతూ విద్యార్థులు నిరంతరం అభ్యసనంలో నిమగ్నం అయ్యేటట్లు చూడడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఒక వెబ్సైట్ ను , యూట్యూబ్ ఛానల్ తయారు చేసి అందులో విద్యార్థుల చూపిన ప్రతిభను, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను అప్లోడ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాశాఖ అధికారులకు, మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాఠశాల గురించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకొని, ఉపాధ్యాయులు కృషిని అభినందిస్తూ, పాఠశాలపై నమ్మకంతో వారి పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మన బాలుర ప్రభుత్వ పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించడం జరుగుతుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామారావు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ వివరించారు.
అనంతరం కలెక్టర్ విద్యార్థుల ప్రతిభను పరిశీలించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. అదేవిధంగా మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కి మంజూరైన నిధులను ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.