నారద వర్తమాన సమాచారం
జూన్ :14
మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. బాలిక ఎదురుగా అబ్బాయి నగ్నంగా ఉండటం అనేది అత్యాచార యత్నం కాదు – రాజస్తాన్ హైకోర్టు
33 ఏళ్ల క్రితం నమోదైన అత్యాచార యత్నం కేసుపై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు
రాజస్థాన్ – టోంక్ జిల్లాలోని తోడరైసింగ్ అనే ఊరిలో 1991లో ఓ ఆరు ఏళ్ల బాలిక రాత్రి 8గంటలకు నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఆ బాలికను సువాలాల్ అనే వ్యక్తి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకు వెళ్లి ఆ బాలిక లోదుస్తులు తొలిగించి.. సువాలాల్ కూడా బట్టలు విప్పి నగ్నంగా మారాడు.
ఆ సమయంలో బాలిక కేకలు పెడుతూ ఏడ్వడంతో స్థానికులు వచ్చి రక్షించి నిందితుడిని పోలీసులకు పట్టించారు.
ఈ కేసుపై 33 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడగా.. రాజస్థాన్ హైకోర్టు బాలిక లోదుస్తులు తొలిగించి.. అబ్బాయి తన దుస్తులు తొలగించుకొని నగ్నంగా ఉండటం.. అత్యాచార యత్నం కాదని చెప్పింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.