
నారద వర్తమాన సమాచారం
జూన్ :14
చిలకలూరిపేట
ఎంత త్వరగా పద్ధతులు మార్చుకుంటే అంతే మేలు: ప్రత్తిపాటి
ప్రత్తిపాటి పుల్లారావుకు వివిధ శాఖల అధికారుల శుభాకాంక్షలు
అయిదేళ్ల అరాచక వైకాపా పాలనకు అలవాటు పడిన యంత్రాంగమంతా ఎంత త్వరగా వారివారి పద్ధతులు మార్చుకుంటే అంతమేలని హితవుపలికారు మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. సమస్యలతో తమవద్దకు వచ్చే ప్రజలందరికీ ప్రతిఒక్క అధికారి, ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది జవాబుదారీ తనంతో వ్యవహరించాలని ఆయన సూచి ంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలభారత సర్వీసుల అధికారులకు ఏ ఏ విషయాల్లో అయితే తీరు మారాలని దిశానిర్థేశం చేశారో అవే అందరికీ వర్తిస్తాయన్నారు ప్రత్తిపాటి. సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తెలుగుదేశం కూటమి తరఫున అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన ఆయనను శుక్రవారం వివిధ శాఖల అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. చిలకలూరిపేట పండరీపురంలోని ప్రత్తిపాటి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు. ప్రత్తిపాటిని కలిసిన వారిలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆర్టీవో అధికారులు, నాదెండ్ల మండల విద్యాశాఖ అధికారులు, విద్యుత్ శాఖ ఏడీఈ, పట్టణ సచివాలయాల సిబ్బంది, మహిళా పోలీసులు, తదిరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి రాష్ట్రంలో కొలువుదీరింది ప్రజాప్రభుత్వం అని స్ఫృహను ప్రతిఒక్కరు గమనంలో పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు, విధాన నిర్ణయాలను అమలు చేయడం, ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో అధికార యంత్రాంగానిదే కీలకపాత్ర అని, దానిని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.