నారద వర్తమాన సమాచారం
దేశానికి అన్నం పెట్టేది అన్నదాతలే
రైతు పొలంలో సొసైటీ బ్యాంక్ అధికారులు ఎర్రజెండాలు పాతడంతో బ్యాంక్ ఎదుట ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
దేశానికి అన్నం పెట్టేది అన్నదాతలేనని, అలాంటి రైతులను మానసికంగా రుణాల వసూళ్ల పేరుతో వేధించడం తగదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని సొసైటీ బ్యాంక్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందే కాక అధికారంలోకి రాగానే రుణాల వసూళ్ల పేరుతో వేధింపులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఆగస్టు 15 కు వాయిదా వేసినట్లు తెలిపారు. రైతులు పంటల సాగు కోసం రుణాలు తీసుకొని వాయిదా అడిగిన వినకుండా పొలాలలో కెళ్ళి ఎర్రజెండాలు పాతడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతులను వేధింపులకు గురి చేసినట్లు కదా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన బారాస పార్టీ ఉంటుందని రైతులు ఎలాంటి ఆందోళనలను చెందవద్దని వారికి తోడుగా మాజీ సీఎం కెసిఆర్ ఉన్నారని భరోసా ఇచ్చారు. వెంటనే బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, పాతిన ఎర్రజెండాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు దివిటి రమేష్, ముదాం సాయిలు, మనోహర్, నరేష్, బండి నరసింహులు, రవీందర్ నాయక్, గన్ను నాయక్, ఉమ్లా, రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.