నారద వర్తమాన సమాచారం
రైతు భూమిలో బ్యాంక్ ఫ్లెక్సీ..
అప్పు చెల్లించకుంటే వేలం వేస్తామంటూ హెచ్చరిక..
పోల్కంపేట గ్రామ రైతుల ఆందోళన…
అడ్డగోలుగా పెరిగిన వడ్డీ తగ్గించాలని విజ్ఞప్తి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి : జూన్ 14
సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకా లిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధి కారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామా రెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కం పేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకా లిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు.అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గిం చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగు తున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.