నారద వర్తమాన సమాచారం
అమరావతి
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”
తొలిఅడుగులోనే యువనేత సంచలన నిర్ణయం
ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్
మంగళగిరి:
గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్… ఇటీవల ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్… నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు “ప్రజాదర్బార్” ను నిర్వహించారు. శనివారం ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా, యువనేత లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.