నారద వర్తమాన సమాచారం
జూన్ 15
ఎన్నికలైన తరువాత నుంచీ రోజా ఎక్కడా వినిపించలేదు.
ఎక్కడా కనిపించలేదు. పోలింగ్ రోజునే తన పరాజయాన్ని అంగీకరించేసి, కౌంటింగ్ తొలి రౌండ్లలోనే కౌంటింగ్ కేంద్రం నుంచీ మీడియాకు ముఖం చాటేసి మరీ వెళ్లిపోయిన మాజీ మంత్రి రోజా ఆ తరువాత పూర్తిగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆమె చెన్నైకి మకాం మార్చేసినట్లేనని కొందరు, కాదు కాదు బెంగళూరులో తలదాచుకున్నారని ఇంకొందరు అంటున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. మంత్రిగా ఉండగా ఆమె పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అవి ఆమెను వెంటాడుతున్నాయి. వేటాడుతున్నాయి అనిపించక మానదు.
ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఆమె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఆమెకు కలెక్షన్ క్వీన్ అన్న బిరుదు కూడా ఇచ్చారు. ఇలా మంత్రి పదవి చేపట్టగానే అలా కలెక్షన్ కౌంటర్ ఓపెన్ చేసేశారంటూ ఆరోపణలు గుప్పించారు. రోజా సోదరుల దందా మితిమీరి సాగుతోందని విమర్శలు చేశారు. అవన్నీ పక్కన పెడితే మంత్రి హోదాలో ఆమె వారం వారం తిరుమల సందర్శన చేయడంపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
వందల మంది మందీ మార్బలంతో ఆమె తిరుమల సందర్శించి అందరికీ ప్రొటోకాల్ దర్శనాలు చేయింయడం వెనుక పెద్ద కుంభకోణమే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తన వెంట వచ్చిన వారికి ప్రొటోకాల్ దర్శనం చేయించడం ద్వారా రోజా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజల గురించి కూడా రోజా వారం వారం వందల మందితో చేసిస ప్రొటోకాల్ దర్శనాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజాతో పాటు ప్రొటోకాల్ దర్శనం చేసిన వ్యక్తుల ఆధార్ కార్డుల వివరాలు టీటీడీ వద్ద ఉంటాయనీ వాటి ద్వారా రోజా ప్రోటోకాల్ దర్శనాల గుట్టు బయటపెట్టొచ్చని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలేశుని దర్శనానికి వచ్చిన నారా చంద్రబాబునాయుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రక్షాళన తిరుమల నుంచే మొదలౌతుందని అన్న నేపథ్యంలో.. రోజా ప్రోటోకాల్ దర్శనాల కుంభకోణంపై విచారణ వెంటనే జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.