నారద వర్తమాన సమాచారం
జూన్ :15
ఐదేళ్లపాటు మండల అభివృద్ధి కోసం పాటు పడ్డ:
ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పోచంపల్లి మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దడానికి కోసం ఐదేళ్లపాటు కృషి చేశానని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
పురపాలక కేంద్రంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశంలో వివిధ శాఖల సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు. రానున్న వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో అధికారులు సమ్యవనం ప్రజల సహకారం తో మండలంలోని అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పన 90% పైగానే పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికి గ్రామాలలో చిన్న చిన్న పనులు తప్ప మౌలిక వస్తువులకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. దీంట్లో అధికారులు ఎంతో గొప్పగా సహకరించారని ఆయన అన్నారు. అధికారులు, ప్రజలు, నాయకుల కలిసి పని చేసినప్పుడే గ్రామాలలో నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా రానున్న నాయకులు తమ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, ఎంపీడీవో భాస్కర్, ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, పిఆర్ ఏఈ వెంకటేష్ , వ్యవసాయ అధికారి ఎజాస్ అలీ ఖాన్, మండల వైద్యాధికారి శ్రీవాణి, సూపర్ ఇండెంట్ అపర్ణ, ఎంపీటీసీలు బంధారపు సుమలత లక్ష్మణ్ గౌడ్, చిల్లర జంగయ్య యాదవ్, రావుల శ్రీదేవి శేఖర్ రెడ్డి, బొక్క అమృత, మొగిలి పాక యాదగిరి, చిలక బుచ్చయ్య, బొచ్చు శంకరమ్మ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.