Friday, December 27, 2024

హైదరాబాద్ వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది

నారద వర్తమాన సమాచారం

నేడు హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన

తెలంగాణ

:జూన్ 17
హైదరాబాద్ వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. ఒక్కసారిగా నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకూ ఉక్కబోత కలిగించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

కారు మబ్బులు ఆకాశాన్ని అలుముకున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగా దంచి కోటింది ఈ సమయంలో బయటకు వస్తే అంతే సంగతులు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం పక్కా. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, లింగంపల్లి, సికింద్రాబాద్, పలు ప్రాంతాలతో పాటు

అల్వాల్, ఎల్బీ నగర్, నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, బాలానగర్, కూకట్ పల్లి, దిల్ షుక్ నగర్, బోయిన పల్లి ఏరియా లతో పాటు పటాన్చెరువు, సమీపంలోని ఇంద్రేశం, లో కూడ భారీ వర్షం కురిసింది..

రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణం శాఖ వెల్లడించింది…

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading