జూపూడి, కిలేశపురం గ్రామాల్లో ఎన్డీఏ విజయోత్సవ వేడుకలు.
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు.
ఇబ్రహీంపట్నం, ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా.ఇబ్రహీంపట్నం మండలం జూపూడి, కిలేశపురం గ్రామాల్లో ఎన్డీఏ మహాకూటమి విజయోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవి బాధ్యతలు చేపట్టడంతో పాటు, మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు భారీ మెజార్టీతో గెలుపొందిన కారణంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు._ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో భారీగా అన్నదానం నిర్వహించారు. కేకులను కట్ చేసి అందరూ పంచుకున్నారు. జోడెడ్ల బండిపై ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు తో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదుని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ. మైలవరం నియోజవర్గ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు, బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.