నారద వర్తమాన సమాచారం
ఏపీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బట్టపర్తి నియమాకం.
జి కొండూరు ప్రతినిధి.
జి కొండూరు జూన్ 19
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు బట్టపర్తి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బు ల్లా రాజారావు బట్టపర్తి రాజును నియమించినట్లు ఆయన ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు.
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు గురించి అలాగే వారి హక్కుల పరిరక్షణ కోసం బట్టపర్తి రాజు కృషి చేయాలని అధ్యక్షులు బుల్ల రాజారావు కోరారు .రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల భద్ర త కోసం త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు బట్టపర్తి రాజు పేర్కొన్నారు .తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షులు రాజారావుకు కమిటీ సభ్యులకుప్రత్యేక కృతజ్ఞతలు బట్టపర్తి రాజు తెలిపారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.