నారద వర్తమాన సమాచారం
జూన్ :19 :నరసరావుపేట
సాధారణ తనిఖీల్లో భాగంగా నరసరావుపేట 2వ పట్టణ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ మలిక గార్గ్ ఐపిఎస్
- పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, సిబ్బంది పనితీరును, మొత్తం రికార్డులను ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్, కేసు డైరీలను, రిజిస్టర్ లను రికార్డులను పరిశీలించారు.
- ఈ సంధర్భంగా .ఎస్పీ నరసరావు పేట- 2 టౌన్ సిఐ కి మరియు పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
- రౌడీషీటర్ లపై నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ కేసుల సిడి పైల్స్ ను, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసారు.
- పెండింగ్ లో ఉన్న కేసులను ప్రణాళికాబద్ధంగా త్వరితగతిన పూర్తిచేయాలని, ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
- విజబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, మహిళలు సంచరించే చీకటి ప్రాంతాలలో సమస్యలుండే ప్రదేశాలను గుర్తించి బీట్లను పెంచి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు.
- ఎలక్షన్ కేసులకు సంబంధించి అరెస్ట్ చేయవలసిన ముద్దాయిల కొరకు ప్రత్యేకమైన టీం లను ఏర్పాటు చేసినట్లు, వారిని పట్టుకొని త్వరగా అరెస్ట్ చేస్తామని తెలిపారు.
- కార్యక్రమం అనంతరం ఎస్పీ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటినారు.
- ఈ కార్యక్రమంలో నరసరావు పేట-1 టౌన్ సి.ఐ సిహెచ్ కృష్ణారెడ్డి, నరసరావు పేట-
2 టౌన్ సి.ఐ భాస్కర్ , నరసరావు పేట రూరల్ సీఐ మల్లికార్జున రావు , సర్కిల్ నందు పనిచేయు ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా హోం గార్డులకు రావలసిన మెడికల్ రి ఇమ్బుర్స్మేంట్ బిల్లులు అందచేయటం జరిగింది.
- బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రొమొషన్ లు రాని హెడ్ కానిస్టేబుల్స్ ఎస్పీ ని కలవగా త్వరితగతిన ప్రొమొషన్ లు ఇచేందుకు క్రుషిచేయనున్నట్లు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.