నారద వర్తమాన సమాచారం
జూన్ :20
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్….
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ని హన్మకొండ కనకదుర్గ కాలనీలోని వారి నివాసం నూతనంగా నియమితులైన వేస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి , ఎంపీ డాక్టర్ కడియం కావ్య డీసీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన రాజమహేంద్ర నాయక్ కి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై డీసీపీ తో చర్చించిన ఎమ్మెల్యే , ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.