నారద వర్తమాన సమాచారం
కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి
చైనా:
కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు.
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది.
భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు 47 మంది చనిపోయారు.
ఆ ప్రాంతంలోని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రావిన్స్‌లలో నివాస ప్రాంతాలు నీటమునిగాయి.
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరదల్లో గల్లంతైన వారి కోసం రెస్క్యూ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.