నారద వర్తమాన సమాచారం
పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తా: మున్సిపల్ చైర్మన్ చిట్టిపొలు విజయలక్ష్మి శ్రీనివాస్
కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్
: భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో శనివారం పురపాలక సంఘంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అన్నారు. అందులో ముఖ్యంగా దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం ప్రవేశపెట్టిన తీర్మానాలను 13 వార్డుల్లో నీటి సరఫరా నిమిత్తం 22 లక్షలు డ్రైనేజీ నిర్మాణానికి, 12 లక్షలు హరితహారానికి, నర్సరీ నిర్వహణకు 5 లక్షలు 15వ ఆర్థిక సంఘ సాధారణ నిధులు చేయడానికి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే వీరారెడ్డి, వైస్ చైర్మన్ బత్క లింగస్వామి, కౌన్సిలర్లు కొంగర కృష్ణ, పెద్దల చక్రపాణి, కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, భోగ భానుమతి విష్ణు, మోట రజిత రాజు, దేవరాయకుమార్, కో ఆప్షన్ సభ్యులు జల్ది నరసింహ, మేనేజర్ శ్రీనివాస స్వామి, ఏఈ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.