నారద వర్తమాన సమాచారం
మహిళలపై దాడులు చేస్తే సహించేదే లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూలు
:జూన్ 22
ఆటవికం..అమానుషం..సభ్య సమాజం తలదించుకు నే ఘటన. చోటుచేసుకుంది తెలంగాణలో అవును..
కూలి పనికి రాలేదని..చెం చు,మహిళపై పాషవికంగా దాడి చేశారు. మర్మంగాలపై కారంచల్లి, డీజీల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా మొల్ల చింతపల్లిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
ఓ చెంచు కుటుంబం తన వద్దకు పనికి రావడం లేదన్న అక్కసుతో ఓ ఇసుక వ్యాపారి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధించి పాశవికంగా ఆ మహిళపై దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికు లు పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో బాధిత మహిళను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక వ్యాపారి దాడిలో గాయపడిన బాధిత మహిళను మంత్రి జూపల్లి కృష్ణారావు,ఈరోజు పరామ ర్శించారు. 2 లక్షల ఆర్థిక సహా యం ప్రకటించి బాధిత కుటుంబానికి అన్ని విధాలు గా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మహిళలపై దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుం టామన్నారు మంత్రి జూపల్లికృష్ణారావు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.