నారద వర్తమాన సమాచారం
చైన్ స్నాచింగ్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలిమంగళగిరి రూరల్ ఎస్సై క్రాంతి కిరణ్ మహిళలకు విజ్ఞప్తి
మంగళగిరి
జూన్ :23
ఇటీవల మంగళగిర నగరంలో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లు జరిగాయని,రూరల్ ప్రాంతం పరిధిలో ఉన్న మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదివారం మంగళగిరి రూరల్ ఎస్సై కాంతి కిరణ్ విజ్ఞప్తి చేశారు.ప్రత్యేకించి ఒంటరిగా ఉన్న మహిళలు ఎంపిక చేసుకొని అకస్మాత్తుగా మెడలోని గొలుసులను తెంచుకొని దొంగలు పారిపోతున్నారని,తగు జాగ్రత్త వహించాలని ఆయన మహిళలకు విజ్ఞప్తి చేశారు.మంగళగిరి మండల రూరల్ ప్రాంతాలలో పోలీసుల గస్తీ నిరంతరం నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్కు,కానీ విధుల్లో ఉన్న పోలీస్ వారికి కానీ తెలియజేయాలని,రూరల్ ఎస్ఐ కాంతి కిరణ్ కోరారు.