నారద వర్తమాన సమాచారం
హరితహారం పేరులో మార్పు: వనమహోత్సవం పేరు డిసైడ్
తెలంగాణ
:జూన్ 24
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ‘వన మహోత్సవం’ పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వహయం లో ఈ కార్యక్రమాన్ని ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో నిర్వహించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పేరు మార్చారు.
ఉమ్మడి తెలంగాణలో కాంగ్రె స్ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్ర మాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా..
75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి ‘వజ్రో త్సవ వన మహోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది.
తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సంబం ధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీలను కొత్తగా నియ మిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సమన్వ య కమిటీకి కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిం చనున్నారు.
ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించ నుండగా.. ఎనిమిది మంది ఉన్నతాధికారులు సభ్యులు గా ఉంటారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.