నారద వర్తమాన సమాచారంనరసరావుపేటజూన్ :24పల్నాడు జిల్లా పోలీస్ వారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ మల్లీక గార్గ్ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి మొత్తం 31 ఫిర్యాదులు అందాయి.మాచర్ల పట్టణం నందు ది.09.04.2023 వ తేదీన నంద్యాల సునీత కూతురు అయిన కోమలిపై ఇంటి ప్రక్కన నివాసం ఉండే కేలం సుబ్బారావు (రెంటచింతల మండలం గోలి గ్రామపంచాయతీ కార్యదర్శి) అత్యాచారం చేయబోగా మాచర్ల పట్టణ పోలీసు వారు క్రైమ్ నంబర్ :71/2023 అండర్ /సెక్షన్ 354( డి ) ఐ పి సి 12 ఫోక్స్ యాక్ట్ నమోదు చేసారు. అప్పటినుండి కేలం సుబ్బారావు దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతున్నందున 15.05.2024వ తేదీన కలెక్టర్ కి మరియు ఎస్పీ కి ఫిర్యాదు చేసినను, అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా అత్యాచారం చేయబోయిన విషయంలో పెట్టిన కేసు రాజీపడమని బలవంతం చేస్తూ బెదిరిస్తున్నాడని అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు మరియు తన పిల్లలకు కేలం సుబ్బారావు నుండి ఆత్మ రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీ ని కలవడం జరిగింది.క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటి నరసయ్య కు చెందిన 2ఎకరాల 28 సెంట్ల భూమిని తన తండ్రి అయిన దేవేంద్రరావు కొనుగోలు చేసి తన
పేరు మీద రాసినట్లు, ఆ భూమి విషయమై సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు కేసు నడిచి ఇంజక్షన్ ఆర్ధర్ ఇవ్వగా ఆ భూమిని వేరే వారికి కౌలుకు ఇవ్వడం జరిగింది. అయితే ది.18.06.2024వ తేదీన అదే గ్రామానికి చెందిన కందేటి సీతారామయ్య, నరసింహారావు, రామకృష్ణారావు, శ్రీనివాసరావు అనువారు దౌర్జన్యంగా పొలంలో వేసిన పైరును చెడగొట్టినట్లు దానికి గాను విచారించి న్యాయం చేయమని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామ రైతులు ఏటుకూరు గ్రామస్థుడు, మిరపకాయల కొనుగోలుదారుడు అయిన లక్కిశెట్టి రవి కుమార్, విప్పర్ల గ్రామస్తులు అయిన కొండవీటి నాగేశ్వరరావు, ఆనంగి సాంబయ్య అను మధ్యవర్తుల ద్వారా మిరపకాయలు కొనుగోలు చేసి, డబ్బులు అకౌంట్ కి నెఫ్ట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఫేక్ నెఫ్ట్ రిసిప్ట్ ను వాట్సాప్ ద్వారా పంపించినారు. కానీ అకౌంట్ కి డబ్బులు జమ కాలేదు అని ఫోన్ ద్వారా మాట్లాడితే సరైన సమాధానం చెప్పకుండ సమాధానాన్ని దాటవేస్తున్నట్లు కావున తమ కష్టార్జితం అయిన 24,00,000/- రూపాయలను ఇప్పించవలసిందిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఎస్పీ ని కలిసి అర్జీ ఇచ్చినారు.
బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన కందుకూరి ప్రభావతి భర్త పురుషోత్తం ఆరు సంవత్సరాల క్రితం పోస్టల్ డిపార్ట్మెంట్ నందు పోస్ట్ మెన్ గా పనిచేస్తూ చనిపోగా ఆ ఉద్యోగం తనకు కల్పించమని, కందుకూరి ప్రభావతి పెద్దకొడుకు అయిన విల్సన్ ఆమెను బాగా చూస్తాను అని మాయమాటలు చెప్పి ఉద్యోగం తన పేరు మీద పెట్టించుకుని, ఇప్పుడు కుటుంబ పోషణ పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని, తగిన న్యాయం చేయ వలసిందిగా ఎస్పీ ని కలవటం జరిగింది. బొ ల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన కందుకూరి ప్రభావతి భర్త పురుషోత్తం ఆరు సంవత్సరాల క్రితం పోస్టల్ డిపార్ట్మెంట్ నందు పోస్ట్ మెన్ గా పనిచేస్తూ చనిపోగా ఆ ఉద్యోగం తనకు కల్పించమని, కందుకూరి ప్రభావతి పెద్దకొడుకు అయిన విల్సన్ ఆమెను బాగా చూస్తాను అని మాయమాటలు చెప్పి ఉద్యోగం తన పేరు మీద పెట్టించుకుని, ఇప్పుడు కుటుంబ పోషణ పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని, తగిన న్యాయం చేయ వలసిందిగా ఎస్పీ ని కలవటం జరిగింది.
గురజాల గ్రామానికి చెందిన పెండ్లి సౌజన్య డోర్ నం :384 ఎనుముల లక్ష్మమ్మ ఇంట్లో నివసిస్తుండగా సిద్ధి అనిల్ కుమార్ అనే అతను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వారి కుటుంబ సభ్యులను కొట్టి ఇల్లు ఖాలీ చేయించారు. ఆ ఇంటికి సంబంధించిన ఎవిడెన్స్ కాగితాలు ఉన్నందున సదరు అనిల్ కుమార్ పై యాక్షన్ తీసుకోవాలని ఎస్పి మేడం ని కలవడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.
> ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయసహకారాలు అందించారు.జిల్లా పోలీస్ కార్యాలయం పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.