నారద వర్తమాన సమాచారం
బ్యాంక్ అభివృద్ధి లక్ష్యంగా కృషిచేస్తా
పాలకవర్గం సమక్షంలో చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న తడ్క రమేష్
భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
బ్యాంకు అభివృద్ధి లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ అన్నారు. పట్టణ కేంద్రంలో ఆ బ్యాంకులో చైర్మన్ గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ రంగంలో పోచంపల్లి బ్యాంకుకు అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతినెల తనకు వచ్చే వేతనాన్ని టిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, ఏలే హరిశంకర్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, సూరపల్లి రమేష్, కొండమడుగు ఎల్లస్వామి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.