నారద వర్తమాన సమాచారం
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: పాక మల్లేష్ యాదవ్
సమావేశంలో మాట్లాడుతున్న పాక మల్లేష్ యాదవ్
భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ అన్నారు. పట్టణ కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. రైతు రుణమాఫీ ప్రకటన చేసి రైతుల పక్షాన నిలబడిందన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిని దశలవారీగా పూర్తి చేస్తుందన్నారు. ఇతర పార్టీల నాయకులు రాజకీయం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశం, కొట్టం కర్ణాకర్ రెడ్డి, వెంకటేశం, కుక్క కుమార్, కీర్తి సంజీవ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.