నారద వర్తమాన సమాచారం
జూన్ :26
చిలకలూరి పేటకు రైల్యే లైన్ఏర్పాటుకు కృషిచేస్తా ఎమ్మెల్యే ప్రత్తిపాటి
ప్రజల ఆకాంక్షాలను గౌరవిస్తూ, వారి సమస్యల సాధన కోసం నిత్యం ప్రయత్నిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట రైల్వేలైన్ సాధన సమితి కన్వీనర్ షేక్ సుభాని, సభ్యులు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. చిలకలూరిపేటకు రైల్వేలైన్ ఏర్పాటుకు గతంలో హామీ ఇచ్చిన మేరకు కృషి చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇస్తూ చిలకలూరిపేటకు రైల్వేలైన్ అత్యవసరమని, ఈ దిశగా తన వంతుగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైల్వేలైన్ ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రభుత్వం తమదని వెల్లడించారు.
చిలకలూరిపేటకు రైల్వేలైన్ ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.స్థానికంగా ఉన్న పరిశ్రమలకు ఎగుమతి,దిగుమతి సులభతరం అవుతుందని, వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు కొండవీడు లాంటి పర్యటక కేంద్రం అభివృద్ది చెందుతుందని, చిలకలూరిపేట కు రైల్వేలైన్ వల్ల ఈ ప్రాంతం అన్ని విధాలుగా పురోగమిస్తుందని వివరించారు. కార్యక్రమంలో రైల్వేలైన్ సాధన సమితి సభ్యులు మల్లిఖార్జున్, నవీన్ ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.