Friday, November 22, 2024

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా కి టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు శుభాకాంక్షలు తెలియజేశారు.

గత ఐదేళ్లు సభ సమర్థవంతంగా

జరగటంలో ఎంత కీలక పాత్ర పోషించారని కొనియాడుతూ,, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సభ సాఫీగా సాగటంలో తెలుగుదేశం పార్టీ సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు.

రెండోసారి స్పీకర్ గా ఎన్నికవ్వడం అరుదుగా దక్కే గౌరవం అని, ఇప్పటివరకు ఐదుగురికి అవకాశం దక్కితే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నీలం సంజీవరెడ్డి , బాలయోగి ఉన్నారని పేర్కొన్నారు.

స్పీకర్ గా ఓం బిర్లా సమక్షంలో ఎన్నో అద్భుత సంఘటన జరిగాయని, కొత్త బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయని.. కొత్త పార్లమెంట్ లోకి మారటం, 317, త్రిపుల్ తలాక్, ఐపీసీలో మార్పులు వంటివి వచ్చాయని అన్నారు.

ముఖ్యంగా యువ పార్లమెంట్ సభ్యులకు ఎన్నో అవకాశాలు కల్పించి, కొత్త అంశాలపై మాట్లాడడానికి ప్రోత్సాహాన్ని, మంత్రులతో చర్చించడానికి వీలు కల్పించారని.. వచ్చే ఐదేళ్లలో కూడా ఇలాగే సభను హుందాగా, సమర్థవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading