నారద వర్తమాన సమాచారం
లైంగిక వేధింపులకు పాల్పడిన డిఎల్పిఓ నాగేశ్వరరావు సస్పెండ్
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ *గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.* తన కార్యాలయంలో పనిచేసే మహిళ ఉద్యోగి పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్ధారించిన విచారణ అధికారులు ఉన్నత అధికారులకు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సిఫారసు మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు డిఎల్పిఓ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.







