నారద వర్తమాన సమాచారం
ఆహార పదార్థాల కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి
స్మార్ట్ పాయింట్లో తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాతి, సుమన్ కళ్యాణ్
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఆహార పదార్థాలును కల్తీ చేస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, జిల్లా సేఫ్టీ డిసగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్ వ్యాపారస్తులను హెచ్చరించారు.
పురపాలక కేంద్రంలో శుక్రవారం ఇటీవల రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సూపర్ మార్కెట్ లో ఇటీవల కుళ్ళిన కోడుగుడ్ల నేపథ్యంలో ఫిర్యాదు మేరకు వారు ఆస్మికంగా స్టోర్ ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ని పూర్తిగా తనిఖీ చేశారు. సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి ప్రతి వస్తువులు పరిశీలించి శాంపిల్ ని సేకరించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆమె మాట్లాడుతూ అక్కడ స్టోర్లో కుళ్ళిపోయిన పండ్లు ఉండడం చూసి సిబ్బందిని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన విషయములపై ఆమె ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు అందించే ఆహార పదార్థాలు వ్యాపారస్తులు కల్తీ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. చిన్న వ్యాపారస్తుల నుండి పెద్ద వ్యాపారం వరకు ప్రతి ఒక్కరు ఫుడ్ లైసెన్స్ లు తప్పనిసరి కలిగి ఉండాలని ఆమె కోరారు. మున్సిపల్ పరిధిలో ఉన్న హోటల్లు, మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని లేనిపక్షంలో వారిపై చర్యలు తప్పవని అన్నారు. ప్రతివారం మున్సిపల్ అధికారులు తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. వినియోగదారులకు అందించే ప్రతి వస్తు బిల్లుతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్ పర్ డేట్ తప్పనిసరిగా ఉండే వస్తువులను మాత్రమే వ్యాపారస్తులు విక్రయించాలని ఆమె కోరారు. నిబంధనలు పాటించకుండా తినే ఆహార పదార్థాలలో కల్తీలను విక్రయిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాపులను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. జరిగిన ఘటనపై బాధితుడు వద్ద ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.