సాధారణ ప్రసవాలు పెంచేలా కృషి చేయాలి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ఫోటో రైట్ అప్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తున్న రాష్ట్ర సంచాలకులు రవీందర్ నాయక్ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో రవీందర్ నాయక్నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సిబ్బంది మాత శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ కోరారు. పురపాలక కేంద్రంలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అ రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన ఆరా తీశారు. అనంతరం జిల్లా ప్రోగ్రామింగ్ జాతీయ ఆరోగ్య మిషిన్ పై సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పెద్ద నేరమని వీటిని వీటిని నిర్వహించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా రాజ్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని వీటి ద్వారా శిశు మరణాలు తగ్గినందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలలో గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలను చేసే విధంగా ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచి వాటి నివారణ కోసం కృషి చేసే విధంగా చూడాలని ఆయన తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు సమయపాలనకు వచ్చి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా తీసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి కార్యకర్త తమ విధులను సక్రమంగా నిర్వహించే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి పాపారావు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శిల్ప, యశోద, ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, వంశీకృష్ణ, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి, హెల్త్ ఎగ్జిక్యూటర్స సాయి రెడ్డి, సత్యనారాయణ, హెచ్ఈసి ఇస్తారి, హెచ్ ఓ పోతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.