నారద వర్తమాన సమాచారం
డాక్టరు దేవునితో సమానం : మురళీమోహన్ రాజు
పాత రోజుల్లో వైద్యుదంటే దేవునితో సమానంగా చూసే వారని యువ కవి మురళీమోహన్ రాజు పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని శ్రీత్యాగరాయ గానసభ నందు “జాతీయ వైద్యుల దినోత్సవం” ఘనంగా జరిగింది. ఈసందర్భంగా ప్రముఖులు డాక్టర్ ఎస్.శ్రీకాంత్, డాక్టర్ కె.విశ్వదీప్, డాక్టర్ కె.వరుణ్ దీప్, డాక్టర్ కె.సుజన లను “వైద్యరత్న” అవార్డుతో సత్కరించారు. అనంతరం సమాజసేవకులు నార్ల సురేష్, బత్తిన నరసింహులు గౌడ్, చల్లా భారతి రెడ్డి, డాక్టర్ సరికొండ రమాదేవి, మహర్షి సాగర్, డాక్టర్ బలిజేపల్లి నాగరత్నం, డాక్టర్ చీదరాల చెన్నయ్య, మేడిశెట్టి వెంకటేశ్వర్లు, కొండా వెంకటేశ్వర్లు, చల్లా శ్రీకళ రెడ్డి లను “సేవారత్న” అవార్డుతో ఘనంగా సత్కరించారు. ముందుగా 30 మంది కవులతో “సమాజంలో వైద్యని పాత్ర” అనే అంశంపైన కవిసమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమానికి కళారత్న డాక్టర్ ఎస్.పి.భారతి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా సరస్వతి ఉపాసకులు ఎ.దైవజ్ఞ శర్మ, విశ్రాంత జడ్జి డాక్టర్ బూర్గుల మధుసూదన్ రావు, రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.వేణుగోపాల శర్మ, సినీ దర్శకులు మహేష్ చంద్ర, నిర్వాహకులు కె.మురళీమోహన్ రాజు, చల్లా మాధవి రెడ్డి, వై.చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రాధాకుసుమ, వి.వి.మహేశ్వర రావు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.