నారద వర్తమాన సమాచారం
రేషన్ పంపిణీలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించవద్దు…. సి.సి.ఐ. జాతీయ ఉపాధ్యక్షులు డా!! చదలవాడ హరిబాబు
గుంటూరు
జులై 01:
రేషన్ పంపిణీలో తప్పు చేసిన ఏ అధికారిని ఉపేక్షించవద్దని సిసిఐ జాతీయ ఉపాధ్యక్షుడు డా!! చదలవాడ హరిబాబు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదల బియ్యం గాదె క్రింద పంది కొక్కుల్లా అధికారులు, యం.డి.యు. ల నుండి లంచాలు తీసికొని కళ్ళు మూసుకుని నిద్రపోతునట్లు నటించిన అధికారులందరి మీద చట్టపరమైన చర్యలు తీసికొనవలసిందిగానూ, ఏ రోజు కూడా యం.డి.యు. ఆపరేటర్లు కార్డుదారులకు రూ.200 ఇచ్చి వారి బియ్యమును అమ్ముకున్న వారిని, జిల్లాలో అసిస్టెంట్ సివిల్ సప్లయిస్, సివిల్ సప్లయిస్ అధికాలు ఏ రోజు కూడా బియ్యం సప్లైపై పర్యవేక్షించనందున వీరందరిపై కూడా సిఐడి విచారణ చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లయిస్ కమిషనర్ గా పనిచేసిన అధికారి నాకు వైసిపి ప్రభుత్వం వారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నందున పెట్రోల్ బంకులు వారిని, జిల్లా సివిల్ సప్లయిస్ అధికారులను మాముళ్ళు వసూలు చేసి ఇవ్వవలసిందిగా కోరిన సంఘటన వివిధ పత్రికలలో వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వారు ఆస్తులు ఎక్కువగా కలిగి ఉన్నందున ఏసీబీ వారి చేత కేసులు ఫైల్ చేపించవలసిందిగా మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.అనంతరం పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ప్రసంగిస్తూ పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పాత పద్ధతిలో రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ విషయాన్ని సివిల్ సప్లై మంత్రివర్యులను క్యాప్ కో తరుపున కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు బేబీ సరోజిని, మునిపల్లె కవిత, యశ్వంత్ కుమార్, నాగమణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.