నారద వర్తమాన సమాచారం
నేడు కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి
:జులై 01
ఎన్నికల ప్రచారంలో భాగం గా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కూటమి సర్కార్ ముందుకు వచ్చింది.
డీఎస్సీ కంటే ముందుగా రాష్ట్రంలో టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
జులై 1న విడుదల చేయ నున్న నొటిఫికేషన్ కు సంబంధించిన సమాచా రాన్ని బులెటిన్ షెడ్యూల్, సిలబస్ తోపాటు ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షపై అభ్య ర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు.
ఈ నోటిఫికేషన్ కు సంబం ధించి పూర్తి వివరాలను జులై 2వ తేదీ నుంచి https://cse.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీని ప్రభుత్వం అందించనుంది. అయితే గతేడాది ప్రభుత్వం నిర్వహించిన టెట్ ఫలితా లు తాజాగా వెల్లడయ్యా యి.
ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తం గా 2.35లక్షల మంది హాజరయ్యారు. వారిలో 1,37,903 మంది అర్హత సాధించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.