నారద వర్తమాన సమాచారం
ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్
అమరావతి
:జులై 01
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబుఈరోజు ఉదయం ప్రారభించారు.
మంగళగిరి నియోజకవ ర్గంలోని పెనుమాక గ్రామం లో రాములు నాయక్ అనే లబ్దిదారులకు పెన్షన్ అందించారు. రాములు నాయక్ కూతురుకు పెన్షన్ అందించారు సీఎం చంద్రబాబు.
దాదాపు అర గంటపాటు ఆ కుటుంబంతో ముచ్చటిం చిన సీఎం చంద్రబాబు వారి కష్టాలను అడిగి తెలుసుకు న్నారు. తమకు ఇళ్లు కావాలని కోరగా.. ఇళ్లు మంజూరు చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పెన్షన్ అందజేయ నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కూటమి ప్రభుత్వం అధి కారం చేపట్టిన మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పెంచిన పెన్షన్‌ను తొలి నెల నుంచే అమలు చేస్తోంది ఏపీ సర్కార్.
పెన్షన్ పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పెన్షన్ వర్తింపచేసింది ఏపీ ప్రభుత్వం. జులై మాసానిక పెరిగిన పింఛను 4000 కాగా.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి చొప్పున 3000 కలిపి మొత్తంగా 7000 రూపా యలు లబ్దిదారులకు అందించనుంది.
వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పెన్షన్ అందించనుంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.